పుట:2015.393685.Umar-Kayyam.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఉమర్ ఖయ్యామ్

35

పాఠాంతరము :_
ఈ రతనాలుగల్గు గనియెక్కడిదో యిది వేఱు శోభిత
స్ఫార రసాత్మకంబయిన చక్కని యీ తెలిముత్తెపున్ గళే
వేఱు వివర్ణమైన గుణభేదము మీకును మాకె కాని సొం
పారు ప్రియుల్ రచించు నిజభాషల కర్థమె వేఱు; చూడఁగన్.

36

జగమె దేహంబు ప్రాణమీశ్వరుఁడు సురలు
తచ్ఛరీరస్థ ప్రకృతిభూతములు నవయ
వంబు లిదియె యేకేస్వరత్వంబు గాన
తక్కుగాధలన్నియును వ్యర్థములె సుమ్ము.

37

ప్రేమ యను మధుశాలలోఁ బ్రేత నేను
మధువు సేవింతు నిందితమతిని నగుచు
ఆసవం బమ్మువాఁడ నాకనియే శ
రీర మేను జీవుండ నుర్వికి నిజంబు.

38

ఓ సతి నీవు నే నల సముజ్జ్వలకాంతి రసస్వరూప సం
భాసిత సంపదన్ వెలయువారము మేనులు వేఱువేఱుగాఁ
బూసకుఁ గల్గు కన్నమటు పోల్చిన నొక్కటి కాకమాన మీ
భాసుర ప్రేమవీథి నెడఁబాయక యేఁగుచు నుంటి మొక్కటై.