పుట:2015.393685.Umar-Kayyam.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరంజ్యోతి

పడిన కష్టాలు పాటవంబలతిగాక !
సడలిపోయిన సౌఖ్యాలు స్మరణ రాగ
మాశిపోయిన మాటలు మరపురాక
పాటపాడిన పదములు పలుక లేక
వెడలిపోయిన కాలంబు వెదకుచుంటి
వెతుకుచుంటి నామరుగునే వెతకుచుంటి
తెలుసుకొంటి నామరుగునే తెలుసుకొంటి
తిరిగి కాలంబురాదని తెలుసుకొంటి (జన్మ)
లేదు పరతంత్రమికనాకు లేనెలేదు ;
లేదు నాయన్న మౌఢ్యంబు లేనెలేదు
స్వార్థమున నీప్రకృతి నాకు స్వస్తి జెప్ప
బ్రాంతిలో గన్న విషయ విభ్రాంతిగాగ
పోవుచుంటి నాదారినే పోవుచుంటి
కాననంబులో పురములో కానరాని
ఆ అయోమయ మధ్వాస్నమైన దారి
ఆ ప్రళయకాల దంధయ్యమైన యట్టి
చిమ్మ చీకట్లు చెంగట చేరి చేరి
జరిగిపోయె నహస్సులు జగములోన
దాటిపోయెను మెన్నులా దారిలోన
స్వర్గ నరకాల వీధులాశ్చర్యముగను
దారులివ్వగ వాటిని దాటి నిలచి
చూచినా నది నిజముగ శూన్యజగము
కలతబడి మనో దుఃఖాన గలయజూడ
అంతదూరాన నేదియో నవతరించె
అందులో రూపమేదొ నాకానుచుండె
అందు బ్రహ్మాండములును రూపొందుచుండె
ఎవరిదారూపు నాకపుడెరుక బడియె
అదియె నా గురుని స్వరూపమవధిగాను
అతడె ఆఖై లలీషుడు అది నిజంబు