పుట:2015.393685.Umar-Kayyam.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. జగమున ధర్మము నెల కొ
    ల్పఁగ నీశ్వరుఁ డొక్క దివ్యవ్యక్తినిఁ బంపున్
    యుగ యుగమున నాతఁడె యీ
    సగుణాత్మకుఁడైన సారసాక్ష్యుఁడు గంటె.

"బ్రహ్మఋషి" ఉమర్ అలీషా

చ. అణువులయందు సుందర యజాండమునందు హిమాంబు సూక్ష్మపుం
    గణములయందు సూర్యశశికాంతులయందు పరాత్పరా భవ
    ద్వినుత విలాసవైఖరి ప్రవీణతఁ దోఁచుచు నున్నదింకనిన్
    గనుగొన లేనిచో కనులు గల్గిన నంధులుగారె మానవుల్.