పుట:2015.393685.Umar-Kayyam.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

ఉమర్ ఖయ్యామ్

659

నను సృజించునాఁడె విధి నాయెడ నుంచిన విప్లవంబులే
పనివడి పెట్టుచుంటి ; నది పాపమొ పుణ్యమొ వాని మీఱగా
నను వగునే ? ప్రబోధనయ యానము వచ్చునె ? మట్టి నన్నుఁ జే
సిన యలమూస మార్చుటకుఁ జిక్కునె ? మూసనుబోలి యుండితిన్.

660

ఏ నను మట్టిబొమ్మను నిసీ ! విధి మూసను బెట్టి తీసి, యె
న్నేనియు విప్ల వంబు లొనరింపఁగఁ బంపెను ; మున్నుఁ జేయుచో
నే నెటువంటి రీతిని వహించితినో మఱి మాఱనేర్తునే
పూని యిదేప్రకార మల మూసయు నను రచించెఁ బ్రేముడిన్.

661

మధువు ద్రావుచు నుంటి నా మాడ్కిఁ దెలివి
గలుగువా రిది యెగ్గుగాఁ దలఁపఁబోరు
పుట్టినప్పుడె విధికి నాగుట్టు తెలియు
నింక మధువు మానిన విధి యెఱుక చెడదె !

662

తనకున్ దోచినరీతివ్రాసె విధి మత్ఫాలంబుపై నే నెఱుం
గనివాఁ డందలి పుణ్యపాపములు నన్‌గారింపఁగా నేర్చునే
మునుజన్నట్టివి, ముందురాఁగలుగు తప్పుల్ ముప్పులున్ నే నెఱుం
గను ; దామై చనుదెంచువానికయి నన్ గారింతురే దేవతల్.