పుట:2015.393685.Umar-Kayyam.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

165

647

గగనముక్రింద నున్న భయకంపము లేదు ; ప్రమాదసంసృతిన్
దగిలితివేని మద్యమును ద్రావుము తీఱును ; నీకు నాదియున్
నెగడిన, నంత మున్న నది నేలనె గాదొకొ నేఁడు నేలపై
వగరిన నేలలోననె నివాస మటంచుఁ దలంపు మెంతయున్.

648

పాపము, పుణ్యమున్ నరుల భావములన్ గల ; వార్తియున్, సుఖ
ప్రాపిత, మర్థసంచయము ప్రాప్తముపై విధిపైని లేవు, నీ
వై పరికింప నావిధి యనంతమహాకలుషానుషంగమం
దోపక వేగుచున్న దదిగో ! మనకంటెను వేయిరెట్లుగన్.

649

వివిథవిలాస రూపముల విశ్రుతిఁ జేసి యెఱింగి, హెచ్చుత
గ్గవమము లేలపెంచెనొ కటా ! యివి చక్కనఫక్కి లేనిచో
నెవనిప్రమాద మయ్యది యవే కడుఁజక్కనిఫక్కి నున్నచో
దవిలి నశింపఁజేయుట యధర్మమె యావిధి చెయ్ద మారయన్.

650

ప్రేమ దురంత దుఃఖములఁ బెట్టెడిదే విధిప్రేరితంబునై
యీమహి సొంపునింపు నదియేల నిషేధమొనర్తు రీశ్వరుం
డే మనపుణ్యపాపముల నిచ్చెడువాఁ డగునేని, యంత్యమం
దేమిపరీక్ష సేయు నిది యేమిరహస్యమొ తెల్ప రెవ్వరున్.