పుట:2015.393685.Umar-Kayyam.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

ఉమర్ ఖయ్యామ్

651

విధికన్న నెవరధికులయి
యధికారము సేయనేర్తు రందణఁగని దీ
పృథివిని లేదు ; స్వభావా
వధి మాఱును, మాఱ వన్యపథమున నెవియున్.

652

మముసృజియించునాఁడె విధి మాగతి యేమగు నన్నమాట ని
క్కముగ నెఱింగియుండెరు ; నఘంబులు నాతనియాజ్ఞలేక యే
తమి నొనరింపనేర్తుము ? పదంబడి పట్టి లయాంతమం దదే
మము నరకాగ్నిఁ గూల్చు ననుమాట కొకింతయు నర్థమున్నదే.

653

ప్రాప్తఫలకంబుపై మున్నెవ్రాసె నన్ని
యింక విధిలేఖినికిఁ జనియేమి గలదు ?
నుదుటఁ గల దేదొ యదెవచ్చు నెదుటి కెపుడు
కుమతి ! వగచెద వేల యత్నముల, శ్రమల ?

654

విధిచెయ్దింబుల కెల్ల నొప్పుకొనకే వేఱేది గత్యంతరం
బు ధరిత్రిన్ బ్రజతోడ మైత్రి నెద నామోదాన లేకున్నచో ?
వ్యధ నీబుద్ధికిఁ దోఁచినన్ని పెడత్రోవల్ ద్రొక్కితిన్ గాని, యే
పధమందై నఁ బ్రమాదముల్ గడచు విశ్వాసంబు లేదయ్యెడున్.