పుట:2015.393685.Umar-Kayyam.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

163

640

ఒహిక వాంఛల దిటుల యార్తివహింపఁగనేల, యందు నే
దేహినినైనఁ గాంచితిరె దృక్కుల మృత్యువు లేనివాని ? నీ
దేహమునందుఁ బ్రాణమొక దివ్యవరంబు, వరంబురీతి సం
దేహము మాని దీనిఁ గడుఁ దీయని దారిని వాడుకోవలెన్.

641

చావిల వచ్చు వచ్చినను జావఁగవచ్చును ; గాని బాధలన్
జావఁగనేల ? నిత్యభవ సంస్కృతి స్థూలశరీర మారయన్
గేవల రక్తమాంస మల కిల్బిష చర్మ వసావికారమే
కావున నిట్టి వ్యర్ధతమతంబునకై విలపింప నేటికిన్.

642

చనినదినాలు వేగముగఁజన్న నదీసలిలంబురీతి, చే
తిని గల గాలిచందమునఁ దెంపునఁ బోయెను ; నాదు జీవితం
బునఁ బనినట్టికాలమును ముం దిఁక వచ్చెడికాలఫక్కికై
మనమునఁ జింత సేయఁ ; గొఱమాలిన భూతభవిష్యదర్థముల్.

643

కాలపుఁ బళ్ళెరంబున వి కాసమనోహర వస్తుజాల మే
పోలికనైనఁ గాసఁబడఁ బోదు ; ధరిత్రిని నిర్విచారియై
పోలినవాఁడు లేఁడు ; సతమున్ మృతి భీతి యెసంగుచుండు, జం
బాలజగంబులో మసలువారల కేమిప్రయోజనం బగున్.