పుట:2015.393685.Umar-Kayyam.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

ఉమర్ ఖయ్యామ్

636

మేమిల భూతపంచక సమీకరణంబునఁ బుట్టినార ; మీ
భూమి నశించిపోవుటను భూరిరుజాపఠిపీడితాత్ములై
యేమఱియుంటి ; మీవగపు లీతను వుండెడిదాఁక నుండు ; నా
పై మఱి యుండ వీ తనువుఁ బాసిన పూతులమౌదు మన్నిటన్.

637

ఓ విధి ! నీవు నాహృదయ మూరక దుఃఖములందుఁ బెట్టుచున్
బోవుచు సంతసంబనెడు పూతదుకూలము లెల్లఁ జించి, నే
నేవలనైన గాలినొక యించుక పీల్చిన దాని నగ్నిగాఁ,
ద్రావెడునీరు నోట నిలఁ ద్రవ్విన మట్టిగ మార్తు వక్కటా.

638

ఏమి త్వదర్థభంగ మొనరించితినో నిజమాడు మోవిధీ !
తామసమొప్ప నన్నుఁ బరితాపములన్ విషమస్థలంబులం
బ్రాముచుఁ బంచపంచలకుఁ బంపుచు నాకటికూటి కక్కటా
మోమునువాయ వాసిచెడ మొత్తెదు గ్రుక్కెడు నీళ్ళొసంగకే.

639

జగ ముపకారమున్ సలుపఁజాలు నటంచు భ్రమింపఁబోకు; నె
వ్వగ లిడుకాలచక్రము శుభంబగునంచుఁ దలంపఁబోకు ; మే
తెగులునకైన మందులిడి తీర్చుశ్రమన్ బరువెత్త కోర్చుకోఁ
దగునలవాటు సేయుమది ధన్యతఁ గూర్చు రుజాప్రశాంతీయై.