పుట:2015.393685.Umar-Kayyam.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ఉమర్ ఖయ్యామ్

438

తరుణీసంగమమున్, సురాసవము నెందాఁ కీవు కాంక్షింతువో
మురళీగాన వినూత్న వాద్యముల యామోదంబులం దాఁక నీ
చెఱుఁగున్ వీడవు ; వమ్ము లీపథము లిస్సీ ! యైహికాపేక్షలన్
దెరలన్ ద్రోయకయున్న మిథ్యసుమి యీ దృశ్యంబు నశ్యంబగున్.

439

"షావాసురజ్జబుల" సురఁ
ద్రావఁగ వలదందు రవియుఁ బ్రభువైన రసూస్,
దేవుని నెల లని ; సరె నేఁ
ద్రావెద సుర స్వేచ్ఛగాఁగ "రజాను"నెలన్.

440

వారముల నెల్ల సురఁ ద్రావవలయు ; శుక్ర
వార మని మానవలవ ; దే వారమైన
సమమె మా మతమందు ; వారముల కీవు
భక్తుఁడవు కాకు మీశ్వర భక్తుఁడగుము.

441

దొన్నెలను వీడి కలశంబుతోడ మధువు
ద్రావు మిగి శుక్రవారము ప్రతిదినంబు
కన్నఁ బదిరెట్లు సురఁద్రావ గర్జ మిందు ;
వారముల ఱేఁడు గద శుక్రవార మన్న.