పుట:2015.393685.Umar-Kayyam.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

ఉమర్ ఖయ్యామ్

275

ఓవిధి ! యెంతకాల మిటు లూరక వేదనలందు డింతు వ
య్యో విరమింపవేమి ? తను వొయ్యన దగ్ధత నొందె దానిపై.
నీవు సతంబు క్షారమును నింపెదవేల దయావిహీనవై ?
కావుమి యీశ్వరార్థమె యకారణవైరము మాని మానివై.

276

నీయెడ సంతసంబనెడు నింగి తురంగము నెక్కి పర్వునన్
బోయినఁ గాని నేటి కొక పూటయినన్ సుఖ మబ్బలే దిఁకన్
వే యన నేల ? నీ సహజ విశ్రుతియే తెలియంగలేదు ; మా
ప్రాయము దొంగదారి నిలయం బిటుచేసితి కాలచక్రమా.

277

ఈ జగత్సర్వ మరసి వీక్షించినాఁడ
కర్తృకారణ కార్యముల్ గానఁబడును
వ్యర్థ మియ్యది ; యేవంక నరయుచున్న
నదె నిరర్థక మని బోధ యగునుగాదె.

278

ఈ శరీరపంజరమున కెలమి వచ్చి
మానవత్వంబు గోల్పోయి మనుచునుంటి ;
నిట్టిపుట్టుక విసువు పుట్టించె నింక
బ్రతుకవలె ననిలేదు లాభంబు లేదు.