పుట:2015.393685.Umar-Kayyam.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమర్ ఖయ్యామ్

69

271

ఏను పిపాసఁ జేడ్పడితపించుచు నీళ్ళకుఁ జేయిచాచినన్
గాని లభింపవయ్యె ; నెద కామ్యఫలాప్తికిఁ జొక్కిపోయినన్
గాని లభింపదయ్యెఁ దుది గమ్యతలంబు, వయస్సు నాశయం
దే నశియించెఁగాని యొక యీప్సితమైన ఫలింప దింతకున్.

272

వయసను మాయకాఁడు పలుబాముల డించుచు నెన్నినాళ్లు దు
ర్ణ యమగు కల్లుమడ్డినిడి ద్రావఁగజేయునొ యీ వివాద సం
చయ మిఁక గ్రుక్కెఁడాసవము చాడ్పున వేసరి స్రుక్కియున్న యీ
వయసును నేఁలబోయకయె వాయదు దీని తెఱం గెఱింగినన్.

273

ఓవిధి ! దుర్మదాంధమతి నొంపకు మమ్మిటు నీనిపాతమున్
మావిభవాభివృద్ధిఁ గనుమా త్రుటి ; మేము దరిద్ర దుఃఖ దు
ర్భావముచేతఁ జేడ్పడి ప్రభావము దక్కి నిరాశఁ జిక్కి ప్రా
ణావిలతాప్తిచే విసిగి యార్తిఁ గృశించుచునుంటి మీయెడన్.

274

చక్రము ద్రిప్పుచుంటిని వెసన్ గడి యన్నమునైనఁ బెట్ట కీ
వక్రమఫక్కి నన్నొగి దిగంబరుఁ జేయదు మీనమట్లుగాఁ
జక్రము ద్రిప్పువారు వసనంబులు గూర్తురు ; వారికంటె నీ
ప్రక్రియ నింద్యమయ్యె నిఁకఁ బల్కెడి దున్నదె కాలచక్రమా !