పుట:2015.393685.Umar-Kayyam.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమర్ ఖయ్యామ్

67

263

వనముల మెట్టినాము ; పురవాసములన్ బొనరించి నార ; మే
యనువున మా యభీష్టములయం దొకటైన ఫలింపలేదు ; గా
వున వ్యధనే మలీమనత పొందెడి యీ యిహజీవనంబులో
క్షణ మయినన్ సుఖించుగతిఁ గాంచిన మేలని సంతసంపుమా.

264

ప్రాణమా యేల నాలోన వచ్చినావు
పోవలయు నొక్కనాఁ డెటొ బొంది వీడి
ప్రతి ముహూర్తంబు మాఱు దుఃస్థితిని దవిలి
హృదయమా నీవు తుదిఁ దెగుటే నిజంబు.

265

ఏను ననర్హుఁడన్ గుడికి నేఁగ, మసీదున బండ ; దైవ మీ
మేను సృజించెనెట్టు లుపమింపఁగ "కాపరు" గాను, నే రుజా
ధీన కురూపిఁ గాను ;గణుతింప నిహంబు పరంబులేదు నా
మానసమందు స్వర్గ మనుమాటకె తావు లభింప దారయున్.

266

కాలవిధంబునున్ దెలియగాఁ దెరువెద్దియుఁదోప దింత దుః
ఖాలయ మీ జగ త్సకలమారయ రెండవదేది లేదు ; ప్రా
ల్మాలిన యాశలన్ వయసుమాసెను గాని, ఫలంబు శూన్య మిం
తేల ? తదీయగుహ్య మొక యింత యెఱుంగఁగరాదు నేఁటికిన్.