పుట:2015.393685.Umar-Kayyam.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

ఉమర్ ఖయ్యామ్

260

అఘవంతుఁ డైనఁ బుణ్యాత్ముఁ డైనను వారిఁ
               జేరి నా హృదయంబుఁ జెప్ప లేను
ఒకరహ్యము నా హృదుదధిలోపల నున్న
               దది చాలా పెద్దదై యలరుచుండు
దానికిఁ దగిన వ్యాఖ్యానఁబు గావింప
               లేని ఫక్కిని నుంటి నేను మఱియు
ఏ యొకనికి నైన నీ రహస్యముఁ జెప్పి
               పోవుదమన్నను బొసఁగఁబోదు.

261

నిరాశ

హితములు గూర్ప దెప్పుడు నభీష్టములం దొకటైనఁ జేర్ప దీ
క్షితి ; సుకృతాప్తికై యలరి చేరెఁడుగింజలు దైవ మియ్యఁ డం
చితమతి దుష్కృతాప్తికి నిషిద్థఫలంబులు దయ్యమియ్య దీ
గతి విఫలంబు జీవిత మగాధము ప్రీతి యొసంగ దేయెడన్.

262

జీవిత మెల్లఁ బువ్వులును శీధువు వెంబడి నెట్టినామె కా
నీ విధి రెండులోకముల నిష్టఫలం బొకటైనఁ గూర్పలే
దీ విధి నేది యెందు ఫలియింపకపోవఁగ నేల యీ ప్రయ
త్నావసరంబు ; కాఁగలదియౌ నిఁక మాకుఁ బ్రసక్తి యున్నదే ?