పుట:2015.392383.Kavi-Kokila.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

లేదు. Art, poetry భావంలో విశేషంగా వున్నవి. ఇంగ్లీషు వాళ్ళుకూడా ఆయనతోపాటు ఇంగ్లీషు వ్రాయలేరు. ఇంగ్లీషులో కవిత్వం అద్భుతంగా వ్రాస్తాడు, అంతా బాగానే వుంది. అయితే ఆయన రహస్య ప్రవర్తనం నాకు బోధపడటం లేదు.

వెంకట : మీకేగాదండి, ప్రపంచాని కంతటికి గూడా బోధపడడం లేదు.

కళ్యాణ : ప్రాకృతులకు బోధపడదు. పూర్వం మహర్షులుకొండ గుహలలో తపస్సుచేసి భావతరంగాలతో ప్రపంచం నింపేశేవారు. అలాగే మాగురుదేవుడు కూడా చేస్తున్నాడు. తపస్సు పరిపక్వం కావడంతోటె బుద్ధుడు మోస్తరె ఆయన బయలువెడల్తాడు. ఇప్పుడాయన్ను హేళనచేసేవాళ్ళందరు పటాపంచలైపోతారు.

[వెంకటరెడ్డి మొకముచూచుచు టేబిలు పైగా చేయివిసరును. టీ కప్పు దొరలును.]

కళ్యాణ : [టీ గుడ్డలపైకి కాఱకుండా కుర్చీకొంచెము వెనుకకు జరుపుకొనును.]

రంగా : Many a slip between the cup and the lipǃ

వెంకట : అప్పుడు జరగబోయే ఉత్పాతం యెట్లుంటుందోగాని, ఇప్పుడుమాత్ర అయ్యర్ కాఫీబొచ్చెకు తలనొప్పి వచ్చింది. - ఏజంగ్లీ, వచ్చి యీ టేబిల్ తుడువు.

ఏనాది : [టేబిలు తుడుచును.]

కళ్యాణ : అయ్యర్, ఇంకోకప్పు టీ.

రంగా. మీరు ఆశ్రమంలో ఎన్ని సంవత్సరాలుగా వున్నారండీ?

కళ్యాణ : అయిదారు సంవత్సరాలుగా వున్నాను.