పుట:2015.392383.Kavi-Kokila.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవ విజయము

యుందురా? తలంచుకొలఁది నాస్థితి భయంకరమగుచున్నది. మాతల్లిదండ్రు లెట్లు దు:ఖించుచున్నారోగదా? నన్ను వారెట్లు కనుగొని తప్పింపఁగలరు?

[నాలుగుమాలలు తిరిగిచూచి బెంచిపై కూర్చుండును.]

తప్పించుకొని పోవుటకైన దారిలేదు. [ఆలోచనా నిమగ్నుఁడై యుండును]

లతీ : మాకీబలే దాహం చేస్తావుంది. రజనీ పోసిన సారాయి కొంచెం మజాపట్టిస్తాన్ [ప్రక్కన కూర్చుండి కూజాలోని సారాయిత్రాగును] జమ్‌జమా మజాబలారే! రజనీకి నామీద బలే యిష్వాసం వుంది. [కైపెక్కినట్లు నటించుచు] రజనీ! క్యామజా! క్యాతమాషా, సొర్గం పాతాహళం నరకం పాపం, పుణ్యం, సబ్ దీంట్లోనే వుండాయ్. యిద్యా, బుద్ధి గొడ్డుగోదా, యిల్లూవాకిలి, పిల్లా పిసుగు, అంతా దరోబస్త్ దీంట్లోనే గుటగుటా గుటగుటా మున్గిపోతుందిబే, అరరే యే క్యారే - నాకళ్ళునట్టందాని పావడాలాగా గిర్గిరా గిర్గిరా - [పడిపోవును.]

రాజ : అన్నియు కఠినశిలానిర్మితములైన కుడ్యములు. నాజీవితాశ శిథిలమగుచున్నది.

[మెట్లపైనుండి అవగుంఠనము వైచికొన్న మాలతియు, దీపముపట్టుకొని రజనియు ప్రవేశింతురు.]

రాజ : [స్వగతము] ఎవ్వతె యీనారీమణి? నాభాగ్యదేవతవలె ప్రసన్నమైనది!

మాలతి : [స్వగతము] ఎవఁడో సుందరుఁడైన రాజపుత్రుఁడు.

రజని : నేను మెట్ల తలుపుదగ్గిఱ వుంటాను.

[నిష్క్రమించును.]

రాజ : కాంతా, నీవు స్వర్గమునుండి నరకలోకమున జాఱిపడిన యచ్చర పూవుబోణివా?