పుట:2015.392383.Kavi-Kokila.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము 11 : పాతాళగృహము.

________

[లోన కొంచెము చీఁకటిగనుండును. రాజశేఖరవర్మ బెంచిపై కూర్చుండియుండును. ద్వారపాలకుఁడైన లతీఫ్‌సాహెబు రాజశేఖరునికి కనఁబడక ప్రక్క నుండును.]

రాజశేఖరుఁడు : [అటునిటుతిరుగుచు] ఎవఁడురా, యిక్కడ పరిచారకుఁడు? ఎంత అరచినను ఒక్క తొత్తుకొడుకైన హెచ్చరించుకొనఁడు. - ఓరీ, - ఎవడురా అక్కడ? - [పలుకరు]. వీరెవ్వరో పశుప్రాయులు. మట్టు మర్యాద లెఱుఁగని మూర్ఖులు.

లతీఫ్‌సాహెబు : అరె! ఎవడ్రా యీమణ్సి? చెవుకోసిన మేకలాగా పుకార్‌చేస్తాడ్. బందెఖానాలోగూడా పరిశారకుళ్ళు పట్టుదిళ్ళూ కావాలావుంది.

రాజ : మా దివాణమందేయైన నొకొక్క పరిచారకుని గుఱ్ఱపు కమిచీతో పట్టలురేగఁ గొట్టియుందును.

లతీ : దౌలత్ సూస్కుంతే రాజాకి బేటాలాగానే వుండ్యాడ్.

రాజ : [గాలి యాఘ్రాణించి మొగము చిట్లించుకొని] ఛీ, ఛీ, ఎక్కడపట్టినను దుర్గంధము; దుమ్ము దుమారము; కిచకిచమని గబ్బిళముల వాగ్వాదములు. వీరి కిల్లు చిమ్ముటకైన నౌకరు లేఁడు కాఁబోలు. మెత్తలు కుట్టిన సోఫా యొక్కటియైనలేదు. తుదకొక్క మేజాబల్లయైనను కుర్చీయైన నుండ కూడదా?

లతీ : [నవ్వుచు] పడకటిల్లు అనుకొన్నాడ్‌ లాగావుంది.

రాజ : [బెంచిపైన కూర్చుండి మట్టియైన చేతులు చూచుకొని లేచి చొక్కా వెనుకతట్టు మట్టిమఱకచూచుకొని] అబ్బే! నాగుడ్డలన్నియు