పుట:2015.392383.Kavi-Kokila.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 103

                       నేలనాలుగు చెఱగులు నేలఁజాలు
                       వీరవీరులు కుశలవుల్ వెలఁదిమిన్న,
                       అట్టికొమరుల సౌఖ్యంబు నరసియైనఁ
                       గాంతు సన్నిధిఁ గాలంబుఁ గడపుమమ్మ.

సీత : నాయనా, సర్వమెఱింగిన మీరే యిట్లాడుచున్న నిఁక నే నేమిపలుకఁగలను ? ఆర్యపుత్రునకు నాకన్నను గుమారులకన్నను కీర్తియే గదా యాదరణీయము.

వాల్మీ : కుమారీ, నిన్ను మరలఁ బరిగ్రహించుటవలన రామచంద్రుఁ డపకీర్తివంతుఁ డౌనని యెంచెదవా ?

సీత : ప్రజ లట్లు తలంతురు.

వాల్మీ : అమ్మా, లక్ష్మణునివలన నంతయు నెఱింగితిని. నిన్ను వనములకుఁ బంపినందులకు జనులు రామచంద్రుని తొందరపాటును దూలనాడు చున్నారఁట !

            సీత : ఆహా ! యేమి లోకుల చిత్తచాంచల్యము !

                      నోటి కడ్డమాఁకయులేక మాటలాడి
                      సత్యము నసత్యమెఱుఁగరు జడహృదయులు;
                      గాలివీచిన యట్లెల్లఁ గదలియాడు
                      కేతనాంచల మటు వారి చేత మలరు.

వాల్మీ : జానకీ, జనసామాన్యము కర్ణధారిలేని నావవలె ముందు వెనుకకుఁ ద్రుళ్ళింతలాడుచు అనేకవిధములఁ బోవుచుండును.

సీత : నాయనా, యశ్వమేధ మొనరింప సమకట్టిన యార్యపుత్రుఁడు నూతనముగ సహధర్మచారిణిని బరిగ్రహించి యుండునుగదా !