పుట:2015.392383.Kavi-Kokila.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము

వాల్మీ : బిడ్డా, రామచంద్రుఁడు ఏకపత్నీవ్రతుఁడని యెఱుంగవా ?

సీత : అట్లయిన సహధర్మచారిణి లేక యజ్ఞదీక్ష యెట్లు వహించును ?

వాల్మీ : నీ ప్రతిబింబమగు స్వర్ణమయవిగ్రహమె సహధర్మచారిణి యగుట !

సీత : [ఆశ్చర్యముతో] ఏమీ యీవింత ! ఆర్యపుత్రుఁ డెంతటికైనఁ దగియున్నాఁడు.

వాల్మీ : శాస్త్రసమ్మతమని యెందఱో ధర్మవేత్తలగు తాపసు లుపదేశించినను ద్వితీయ పరిగ్రహమున కియ్యకొనక నీప్రతికృతిగఁ గాంచన విగ్రహమును నిర్మింపించి రఘుకులేశ్వరుఁడు దీక్షాకంకణము ధరియించెనఁట !

సీత : [స్వగతము] ఆర్యపుత్రుని యేకపత్నీవ్రత మెల్లకాలము వర్థిల్లుఁగాక !

వాల్మీ : అమ్మా, రామచంద్రుఁడు నిన్ను విడనాడియుండువఱకు స్వస్థచిత్తుఁడు కాఁజాలఁడు.

                      నిండుచూలాలి విడనాడ నేర్చెఁగాని
                      విరహతాపంబు రాముఁడు వీడలేఁడు ;
                      పవలురేయును నిన్నెంచి పనవిపనవి
                      పాండురోగి విధంబునఁ బాలిపోవు.

సీత : [స్వగతము] ఆర్యపుత్రునకు వినోదహేతువైన ఆ కనకవిగ్రహమునకన్న సంతాపకారిణి నగు నేనే దురదృష్టవతిని.

[కుశలవులు ప్రవేశింతురు.]

కుశు : తాతా, మాపాఠముల నొప్పగించుకొనుము. మేము పూజా