పుట:2015.392383.Kavi-Kokila.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 101

లక్ష్మ : [స్వగతము] ఏమీ వాల్మీకిమునీంద్రుల మనుమలా యీ వీరకుమారులు ? ఆజన్మ బ్రహ్మచారికిఁ గుటుంబము కలదా ?

వాల్మీకి : [కుశునిపైవంగి] నాయనా కుశా, [ఒడలునిమురుచు] నీ శరాఘాతములన్నియు నిర్వాధకము లయ్యెడిని లెమ్ము.

లక్ష్మ : [స్వగతము] ఆహా ! తపోధనుల మహత్వము !

కుశు : తాతా, సమయమునకువచ్చి నన్ను రక్షించితివి.

లవు : అన్నా, వేదన శమియించినదా ?

కుశు : లవా, తాతగారి తప:ప్రభావ మమోఘముగదా ?

                      చేతితోఁదీసివైచిన రీతిగాఁగఁ
                      దూపుగంటుల వేదన తొలఁగిపోయెఁ;
                      బూర్వ దోర్బల ముత్సాహమును జెలంగెఁ;
                      దగుదు నేనింక వైరి మర్దనము సలుప.

వాల్మీ : కుమారా, యీ పట్టుదలవదలుము. మాననీయులయెడ నపరాధ మొనరించితివి.

కుశు : [స్వగతము] ఆహా ! యేమి వాల్మికితాతగారి పక్షపాతము.

వాల్మీ : లక్ష్మణా, గొప్పప్రమాదము వాటిల్లినది. లోకవిఖ్యాత వీరులగు మీర లీబాలురతోఁ బోరాడుట ధర్మమా ?

లవు : [స్వగతము] ఇంద్రజిత్సంహారకుఁ డగు లక్ష్మణుఁడా యీతఁడు ?

లక్ష్మ : మునికులతిలకా, మన్నింపవలయు. ఈకుమారకుల మనోహరస్వరూపములు నాహృదయమును గరుణావేల్లితమును గావింపఁ బోరుట కిష్ట పడక సవనాశ్వమును వదలుఁడని యెంత బ్రతిమాలుకొన్నను వీరు వినరై నాప్రయత్నము సాఁగమి రఘుకులేశ్వరు ప్రతిజ్ఞ నెఱవేర్చుటకై అనిష్టము