పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాసి యటంచును వాక్రుచ్చిన జనుండు | నిర్వాణమొందఁడే నిఖిలమెఱుఁగ
సానందుచే షడక్షరి నరుల్ వీనులా | నిరయంబ విడువరే నిరయము భళి
తిరముగాను గురూపదేశంబు నొందియుఁ | గొందఱు మోక్షంబు నొందలేదె


గీ.

జిహ్వ నీ పేరు రక్తి భాషించునట్టి- | వారి సామర్థ్య మెన్నఁగ వశము గాదు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

110


సీ.

ఔద్ధత్యమున బ్రహ్మహత్యఁ గావించితి | క్రూరుఁడవౌట నిక్కువము గాదె
దారుకాంతారకాంతారతిప్రౌఢవు | జారుఁడవౌట నిజంబు కాదె
గౌరీమనోధనహారిపేశలుఁడవు | చోరుఁడవౌట విస్ఫురణఁ గాదె
లింగపటోలికాలీనుండవైతి భీ- | రుఁడవౌట నిర్ణయరూఢి గాదె


గీ.

యిట్టి చేష్టలు దొరలినయట్టు దొరకు | దాస్యమొనరించువాని కొదవునె యెఱుక,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

111


సీ.

అష్టభుజుఁడు యంతయయ్యెఁగా నీకుడ్డ- | చేతులు గలవను హేతువెఱిఁగి
యర్చకుఁడయ్యె దశాననుఁ డరపది- | మోములు గలవను మూలమెఱిఁగి