పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హితుఁడయ్యె ద్రవిణాఢ్యుఁ డెంచ నకించనో- | దంచనుండవటన్న సంచెఱింగి


గీ.

పృథివి నీకంటె భక్తులే యధికులనెడి | వార్త తార్కాణమయ్యె నేవంవిధమున,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

112


సీ.

తిలకింప మడికాసు మలమంచివెన్నెల | మహలుగా వాచంయమప్రవరులు
ఖొజ్జాలు గాఁగ మరుజ్జాతి సరదార్లు | గా జయవిజయులు గాఢమగు న-
కీబులు గాఁగ మేల్గిత ఘోడా గాఁగ | లచ్చిసైఁదోడు కుళాయి గాఁగ
గబ్బుచంకమెకంబు బెబ్బులితోళ్లు జా- | మాతమానులుగా క్షమాతలమున


గీ.

నేనుమొగములసాహేబు నా నలరితి | యవనకర్త సలాం జేతు నాదరింపు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

113


సీ.

మండలేశ్వరుఁడయి యుండఁడే యిప్పుడు | వసుమతిలో శాలివాహనుండు
గణుతింప భక్తాగ్రగణ్యుండు నా మించె | గుండయ్య ధారుణీమండలమున
రామాయణగ్రంథరచనాద్రఢిమఁ గాంచె | మొల్ల వధూటీమతల్లి యనఁగ