పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నీ తనూజుపతాకయై తామ్రచూడరా- | జంబు కాలజ్ఞానసంజ్ఞ నొందె
నీకు గుఱ్ఱంబౌటనే నందికేశుండు | ర్మస్వరూపి నాఁ దగె ధరిత్రి
నీ రవణంబైన నిడుపరాయఁడు మించె | శేముషీధౌరేయశీలనమున
నీ నేత్రమై చిత్రభానుండు భువి జగ- | త్ప్రాణసఖుండు నాఁ బ్రౌఢి మెఱసె


గీ.

నుర్వి మహదాశ్రమము బహుయోగ్య మనుచు | విబుధజనములు వచియంప వింటిఁ గంటి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

97


సీ.

అఖిలజన్మార్జితాంహస్సంహతి హరింప | భారంబుఁ బూనె సుపర్వవాపి
అన్నపానీయాదు లాదరమునఁ బెట్ట | నాయత్తపడెఁ గదా యన్నపూర్ణ
సకలాంతరాయభంజన మొనర్పఁ బ్రతిజ్ఞ | గావించె గద డుంఠికరటిముఖుఁడు
దక్షణశ్రుతిమీదుగా క్షితిపైఁ ద్రెళ్లు | ప్రాణికి స్వస్వరూపము నొసంగ


గీ.

నీవు ప్రతిసరమూనితివే విచార- | మేల నరులకుఁ గాశీపురీచ్ఛ వలదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

98


సీ.

ముందు విశ్వేశ నీ సందర్శన మొనర్చి | బిందుమాధవునకు వందనమిడి