పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

దేవ యివి నిజమైన నన్ బ్రోవరాదె | కాలయాపన మొనరింపనేల చాల,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

94


సీ.

అమలవాఙ్మాధుర్యమబ్బునే హాలాహ- | లాశ్లిష్టకంధరావాప్తి కతనఁ
జల్లనిచూపులఁ జెల్లఁబోఁ గనుటెట్టు- | లగణితోగ్రాక్షుఁడ వగుటవలన
మార్దవ మేభంగి మనమున నొనఁగూడు | నకట గిరీశుఁడ వగుటవలన
స్థావరస్థితి సమాసాధ్య మేగతి యొకో | - జంగమాభిధచే మెలంగు కతనఁ


గీ.

దాత యేతాదృశ్యుడవు గదా జనులకుఁ | గొడుకుపై ఋజుభావము వొడమకున్నె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

95


సీ.

అంతరంగోపవనాంతరంబున సదా | శివశిఖావళమును జేర్చు నెవ్వఁ
డనితరాత్మాలాన మందున మలహర | ద్విపలలామంబు బంధించు నెవ్వఁ
డుల్లఁపుదామర నుడురాజభిత్తమ- | హోత్తంసుఁ డను దేఁటి నుంచు నెవ్వఁ
డఱుఁదుగ హృదయపంజరమున మృడుఁడను | రాచిల్కఁ బ్రీతిమీఱ నెవఁ డుంచు-


గీ.

నట్టి సుశ్లోకుఁడె మదాప్తుఁ డంచు నుందు | నన్యులా బంధువులు శతమన్యుసేవ్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

96