పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రోహిణీశుఁడు గురుద్రోహ మాపాదించెఁ | బరలోకహానికి భయము లేక
దురితంబనాక మాతులవధ యొనరించె | యాదోనిధీశకన్యాధవుండు


గీ.

యిట్టి సాహసికులఁ బ్రోచినట్టి సామి | నన్ను రక్షింప వింత యన్యాయమేమి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

90


సీ.

బ్రాహ్మణుఁ డొకఁడు సర్వక్షేత్రగామియై | వెనుక రుద్రావాసమునకు వచ్చి
యొకనాడు రూపరేఖోన్నతయుక్తయౌ | మధువిక్రయాబలామణి సురఁ గొని
రాఁ గని తన యభిప్రాయముఁ దెల్పిన | నొడఁబడి తన యింటికడకు దెచ్చి
సురతంబుఁ దేల్చిన తఱి జీవితేశుండు | చనుదేరఁగా సాధ్వసంబు మీఱఁ


గీ.

గాఁగులోఁ బారునిడి నిండ గల్లుఁ బోయ | మేన్ దొరఁగి లింగమూర్తియై మెఱసెఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

91


సీ.

నిశ్రేయసాపేక్షనియతిచే శివశర్మ | యను బ్రహ్మవంశవర్ధనుఁ డయోధ్య-
యును మధురయు మాయయును గాశి కాంచికా- | వంతికా శ్రీద్వారవతులు తిరిఁగి-
యును హరిద్వారమందునఁ గాలధర్మంబు | నొంది వైకుంఠంబుఁ జెంది పిదపఁ