పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెల్లఁదామరవిరుల్ తేలేక యుండిన | జిల్లేడుపూలఁ బూజించలేనె
మాలూరపత్రసమాజంబు లేకున్న | నూడుగుపత్తిరి యుంచలేనె
పాయసం బర్పణ సేయలేకుండినఁ | బేర్మిఁ గౌబేరంబు వెట్టలేనె


గీ.

గొప్ప కొద్దియుఁ గలుఁగునొకో సుభక్తి- | మాత్రసులభుఁడవౌ నీదు మానసమున,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

88


సీ.

వారాంగనామణీవక్షోజ మర్చించి | సాలోక్య మొకఁడు హర్ష మునఁ జెందె
నీషదజైకకరీష మారాధించి | సామీప్య మొకఁడు హర్షమునఁ జెందె
జానుప్రదేశపూజానూనదక్షుఁడై | సారూప్య మొకఁడు హర్షమునఁ జెందె
ప్రస్థార్చనాకౌశలస్థిరత్వమ్మున | సాయుజ్య మొకఁడు హర్షమునఁ జెందె


గీ.

నిటుల నాచేతనగునె యక్కట జడుండఁ | గుటిలచిత్తుఁడ మత్తుఁడ గుణరహితుఁడ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

89


సీ.

చిరితొండభక్తుండు శిశుహంతఁ గావించె | నక్కటికం బిసుమంత లేక
గాటకోటఁడు పితృఘాతుకత్వముఁ బూనె | జగతిలో నిందకు శంక లేక