పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

స్యందనకేతువుల్ జ్యానంతములు నియం- | తాశుగములు భారతీశ మేశు-
లురగరుత్తూణము లరుణానుజాబ్దు ల- | ర్వప్రతోదము లాగమప్రణవము-
లుర్వీభృదురగవర్యులు ధనుస్సింజిను- | లతిరథాంగము లహర్పతిసుధాంశు-
బింబముల్ జేసి పురంబులు మూఁడు క- | రంబు నిమేషమాత్రంబులో చె-


గీ.

లంగుచును లీల నేలఁ గూలంగఁ జేసి | యద్భుతరసంబుఁ జూపవే యమరు లమర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

64


సీ.

కాత్యాయనీపృథుకబరికాభరమున | విరులదండలు జుట్టి వెలయువేళ
హైమవతీలలాటాగ్రమందు సితాభ- | తిలకంబు సొగసుగా దిద్దువేళ
లసదపర్ణాకపోలములు కస్తురిచేత | వారకమకరికల్ వ్రాయువేళ
నగజాకఠోరస్తనస్తబకద్వంద్వ- | మందుఁ గుంకుమపంక మలఁదువేళ


గీ.

నుమకుఁ గిలికించితములు సేయుచును హాస్య- | రసముఁ జూపవే స్మేరవిరాజితాస్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

65


సీ.

పసిపాపని హిరణ్యకశిపుఁడు నొప్పింప | గరివరదుఁడు నృకేసరిశరీర-