పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మలవడ నద్దనుజాధము వధియింపఁ | గని ఘనక్రౌర్యంబు గడలుకొనఁగఁ
దడయక నెనిమిదియడుగుల మెకఁపురూ | పముఁ గొంత సాళ్వరూపంబు
గొంత తగువిగ్రహముఁ బూని తన్మానవమృగేంద్రు | పటుదర్ప మొగిఁ దృణప్రాయముగ నొ-


గీ.

నర్చితివి భళియని సుమనస్తతి మిముఁ | బ్రస్తుతింప భయానకరసము నిగుడ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

66


సీ.

శ్రీకంఠ మిము వెలిఁ జేసి దక్షుఁడు యాగ- | మొనరింపఁగ నెఱింగి కినుకతోఁడ
జని పూషు దంతముల్ సడలించి శశిని షో- | డశఖండములుగ నడంచి భగుని
కన్నులు పెరికి పెన్గాలినెచ్చెలికాని | నాల్క లేడును గోసి నలువచెలువ
ముక్కు గ్రక్కునఁ జెక్కి మురవైరి చక్రంబు | చక్కిలముగఁ బుక్కి వెక్కసముగ


గీ.

దక్షు తలఁ ద్రెవ్వనేసియుఁ దత్క్షణమున | భర్గ బీభత్సరసముఁ జూపవె మహాత్మ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

67


సీ.

మదనుఁ డనంగుడు గద మత్తమధుపగు- | ణము నిష్ఫలమ్ము చాపము నలాదు
లస్త్రముల్ ప్రబలసైన్యము పతంగంబులు | తేరనిలం బతీంద్రియుఁడు సూతుఁ