పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈసీతాపతిశతకము రచించినకవి సాహెబు రాణా రామన్న. ఇతఁడు వీరన్నరాజమాంబలకుమారుఁడు. భక్త్యావేశము రామభక్తి పురస్కరించికొని కవి యీశతకమును మృదుమధురశైలిలో వ్రాసియున్నాఁడు. కవికులగోత్రాదికము జీవితకాలము తెలిసికొనఁదగిన యాధారము లీగ్రంథమునఁ గానరావు. ఒకానొక రీశతకకర్త మాధ్వుఁడని యనుమానము కలుగుచున్నదని వ్రాసిరిగాని గ్రంథమునం దటు లనుమానింపఁదగిన భాగములు గోచరింపవు.

కవి యాధునికుఁ డనుటకు సంశయ ముండదు. ఇందుఁ గొన్నిపద్యములు తొలుత నీతిబోధకములై ప్రజలదుర్నయములను గర్జించునవిగ నున్నను మొత్తముమీఁద శతకమంతయు భక్తిరసపూరితమై శ్రీరామస్మరణానుభవముగ నున్నదనుట నిశ్చయము. కవితలో నందందుఁ గ్వాచిత్కముగ వ్యాకరణదోషములు గలవు. శైలి యొకచో నిరర్గళధారాశోభితముగ నొండొకచో గూరుపుబింకము లేనిదిగను గానిపించుచున్నది. కొన్నిపద్యములలో భక్తిరసోద్బోధకములగు సమకాలిక శ్రీరాముని వివిధవిధములఁ గాపాడుమని పలుతెఱంగులం బ్రార్థించుటతో గ్రంథకర్త శతకము సంపూర్తి