పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

గావించియున్నాఁడు. యౌవనమునఁ జేసిన పాపము'లకుఁ బశ్చాత్తాపము నొందుచు లోపముల క్షమించి కైవల్యప్రదాయకుఁడవు కమ్మని కవి రాముని మిగుల స్వతంత్రముగా వేఁడికొనెను. ఇందలిపద్యములు భక్తిరసద్యోతకములై భవతారకములై యలరారుచున్నవి.

కవి యంత ప్రౌఢుఁడు కాడు. గ్రంథరచనారంభమున నీశతకము వ్రాయఁబడెనేమో ధారావికలము కల్పనాక్లిష్టత పదాడంబరము చూచినఁ దోఁచును. కవితాగ్రంథముగ విమర్శింపక భక్తిరసగ్రంథముగ విమర్శింతుమేని యీశతకము విలువగలశతకములలో నొకటి యగు ననుటకు సంశయము లేదు.

అందందు వ్యాకరణదోషములు కలవు. పద్యమధ్యమునందును బాదాదియందును ననవసరములగు పదములు సంబోధనములు కొన్ని కనుపట్టుచున్నను శతకము భక్తిపరతంత్రుల కెంత జదివినను విసువు గలిగింపనంత మృదుమధురముగా నున్నది.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు,

20-10-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.