పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ముకుందశతకము వ్రాసినకవి దూపాటి తిరుమలాచార్యులు. ఇతఁడు లోహితసగోత్రుఁడు. దూపాటికొండమాచార్యులు రంగనాయకమ్మలకు జ్యేష్ఠకుమారుఁడు. తిరుమల సింగరాచార్యగురువర్యుని శిష్యుఁడు. ఈకవి సంస్కృతాంధ్రములందుఁ దనజనకునివద్ద విద్యార్థిగా నిరర్గళపాండిత్యము నార్జించి కవితారచనమున మిగులఁ బ్రతిభ గాంచెను. ఈకవి రావిపాటి కామశతకమను పేరుతో రామాయణకథ నంతయు సీసపద్యములు 108 లో నిమిడించి వేఱొకశతకము వ్రాసియున్నాఁడు. ముకుందశతకమునందలికవిత చిత్రమగుగమనికలతో మనోహరముగా నున్నది. ప్రతిపద్య మొకవిశేషముతోఁ గూడి శ్రావ్యమగు నడకతో వీనులకు విందుఁ గొలుపుచున్నది. కవితలో లాక్షణికవిరుద్ధములగు లోపములు గానరావు.

ఈకవి నివాసస్థానము బాపట్లకు పది మైళ్ల దూరమున సముద్రతీరమునందున్న ఓడరేవు. చిరకాల మీకవి యటనుండి వయస్సుదీరినపిదపఁ దన యెనుబదవయేడు పరమపదవి చేరెను. ఈకవి సోదరుఁడగు శేషాచార్యకవి ప్రౌఢకవి. ఈయన రంగధామ, నకరి .