పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కంటి నృసింహాదిశతకములు, శకుంతల ధనంజయవిలాసాదిగేయప్రబంధములు వ్రాసినాడు. మాపితామహులగు శేషాచార్యుల కీతిరుమలాచార్యకవి యగ్రజాతుఁ డగుకతన మే మీకవిజీవితము నీవిధముగాఁ దెలుపఁగలిగితిమి. కవిమనుమ లిపుడు ఓడరేవులో నివసించియున్నారు. ఇంక నట నేమేని పుస్తకము లుండెనేమో విచారింపవలసియున్నది.

ఈకవి గతించి యిప్పటికి ముప్పదిసంవత్సరములు దాఁటినవి. తిరుమలాచార్యుఁడు స్ఫురద్రూపి యనియు ఆజానుబాహుఁడనియు సంగీతసాహిత్యవిద్యాకుశలుఁడని మాపెద్దవాండ్రు చెప్పుచున్నారు. శతకవాఙ్మయములో నెన్నఁదగినవానిలో నీముకుందశతక మొకటిగ నున్నది.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

5-2-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.