పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్దండరాయశతకము

161


మ.

ఖజకాదండ మెఱుంగునే మృదులశాకస్థాయి యైయుండి వే
ల్లజతిక్త్తాదిరుచుల్ కుపూయకున కేలా కల్గు సద్బుద్ధి సౌ
మ్యజనుశ్రేణులపొందు నంత మనినన్ మద్దాలి...

84


మ.

భుజియింపన్ నవనీతమై యమృతమై పూదేనెయై నారికే
రజలంబై గుడమై రుచించు మృదుసారంబైన నీరామనా
మజపం బెంతటియోగ్యభోగ్యఫలమో మద్దాలి...

85


మ.

ఋజుబుద్ధిన్ నిను సంస్మరింపఁగలుగున్ శ్రీశైలకాశీనివా
స జగన్నాథ గయాప్రయాగసువిశేషంబుల్ మహాదానధ
ర్మజపాధ్వర్యతపోవ్రతైకఫలముల్ మద్దాలి...

86


మ.

త్రిజగద్భర్త యథేష్టసేవ్యుఁడు మనోధిష్ఠుం డగణ్యార్థదా
యి జితక్రోధుఁడు నీవలెం గలుగునే యింకొక్కనాథుండు క
ర్మజకాలుష్యము బాయ నిన్నె గొలుతున్ మద్దాలి...

87


మ.

అజునిం బొక్కిట గన్నవేలుపవు నీయం దాపదుద్ధారకా
ఖ్య జగద్గేయముగాఁ బ్రసిద్ధమగు నీకన్నం గృపాశాలి బ్రే
మ జెలంగం భరియించు టెట్లగును శ్రీమద్దాలి...

88


మ.

అజహద్దంభవిజృంభమాణవిపులాజాండంబుదీపైకరూ