పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

భక్తిరసశతకసంపుటము


పజతేజంబున వెల్లఁజేసెడు భవద్భావంబు వర్ణింప బఁ
ద్మజుఁడైనన్ భవుఁడైన నోపఁగలఁడా మద్దాలి...

89


మ.

భజనీయైకనిగాఢహుంకృతులు సంభావించి వందారువా
గ్మిజనశ్రేణికి విద్యలిత్తువు హయగ్రీవాకృతిన్ నీవు సా
మజచర్మాంబరపూజితాంఘ్రియుగళా మద్దాలి...

90


మ.

విజయున్ భీముని వెంటదోడ్కొని రణోర్విన్ భీముచేతన్ గిరి
వ్రజనాథుం బొలియించి చేసితివి నిర్వ్యాజార్థసంసిద్ధి ధ
ర్మజునింగూర్చిటు యుక్ష్యమాణునిగ శ్రీమద్దాలి...

91


మ.

అజరద్భావసుఖోదయాప్తి తనసొమ్మై నప్పుడే నిన్ను పం
చజనుం డెంచవలెన్ దదారభటి హ్రస్వంబైన యుద్దామభీ
మజరాభారము తోఁచనీయదు సుమీ మద్దాలి...

92


మ.

త్రిజగంబుల్ భరియించి ప్రోతు వెపుడున్ దేవావళుల్ మెచ్చ నం
డజనుఃకూర్మవరాహసింహవటుగాట్సంతానజిద్రామరా
మజినశ్రీకలికిస్వరూపములచే మద్దాలి...

93


మ.

త్యజియింతున్ జనినీకృపారసముచేతన్ భీతతం బాసి దీ
నజనాధారక నిన్ భజించునెడలన్ నాబుద్ధికిన్ యాతయా