పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

శంబుంకవధ


 
          అయినను శంబుకుని తోడఁ బ్రసంగించి చూచెదను. ఓరి ! యెవఁడు
          రాయక్కడ?

దా:- (ప్రవేశించి, స్వామీ! యేమియాజ్ఞ ?

శ్రీ:- ఓరీ ! 'మొన్న కాంభోజ రాజు పాయనంబుగాఁ బంపిన యుత్తమా
          శ్వమును సజ్జీకృతము గావించి వెంట నేగొనిరమ్ము
,
దౌ: చిత్తము. (నిష్క్రమించి మరల గుర్రముతోఁ బ్రవేశించును)

శ్రీ:- (గుర్రమెక్కి) చీ ! యెడమకన్నదురుచున్నది.కారణ మేమి
         చెప్పుమా?

        గీ| నాకు గురు వెన్ని స్మృతులు క్రో డీకరించి
       చెప్పినను ధర్మమిదియంచుఁ జిత్రమే మొ
       సంశయాత్ముఁడనైతినీ సమయమందు
       గారణము మాత్రము మదికిఁ , గాన రాదు

      గీ అంతరాత్మ పీడితుఁడను •నగుటచేతఁ
      జేయునది లేక మన సెల్లు . జెదురుచుండె
      నీట్టిసమయంబునను యుక్త మిదియటంచు
      నెట్లుబుద్దికి బొడమునో •యెఱుగరాదు

  • శ్చిదానందాశ్రరమము )


బడలికతో శ్రీరామచంద్రు'డు ప్రవేశించును.



     శ్రీ:-అబ్బా ! సూర్యాతపముచేత డస్సిన నాసర్వాంగములను సేద
     దేర్చుచున్న యీమృదు సౌరభ శీతలములగు' మలయ పవన కిశోర
     ములు నాకు బ్రహ్మానందముఁ గూర్చుచున్నవి. పాంధులపధికా
     యాసమును నపనయింప నేనెఱుంగకుండ నీయరామప్రతిష్ఠఁ,