పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

55

     గావించిన వాఁడెవఁడై యుండనోపు ! (దిక్కులు పరికించి) యేమి
     యీయకాల వసంతాగమము. లతాసమానృతము లయిన యీని
     కుంజుపుంజములు కోరికితములును, బుప్పితములునై యీ యారామ
     నివాస మాహాత్యమును బ్రకటించు చున్నవి. (ఉలికిపడి) యేమి !
     యౌరౌర!! యాశ్చర్యము. చిలుక గోర్వంక లెల్లను వేదపాఠములను
     బఠించుచున్నవి. అయ్యా రే! కోయిలలా సామగానముఁజేయుట,
     ఏజితేద్రియుని పవిత్రాశ్రమమోకదా యిది.కనుగొనియెద.
     ఋష్యాశ్రమమునకు నశ్వారూఢుడనై పోవుటయుక్త మా?: కాదు
     (అశ్వాపరణము గావించి ముందునకు నడిచి సోమలతకుఁ బా
     దుత్రవ్వి నీళ్ళు పోయుచున్న బ్రహచారింగని) కుమారా ! యచ్చ
     ట యేమిచేయు చున్నావు ?

బ్ర:- (తలయెత్తి చూడకే పొదుఁద్రవ్వుచు) యేమిచేయుచున్నానో
       కన్పట్టుట లేదా ! (అనంతరము శ్రీరాముని వంక నెగా దిగ జూచి)
       ఇదిగో ! ద ర్భాసనంబు. ఇచ్చట దయచేయుఁడు. అతిథిపూజ
       మాకు గురోపదిష్టంబు. మాగురువు గారిని జూచి పోవుటకై
       మొన్న కణ్వుల వారువచ్చి యీ సోమలతను నిచ్చిపోయిరి. దా
       నికి నీరుపోసి పెంచుటకు మాగురువుగా రాజ్ఞ యిచ్చిరి.ఆపని
      ప్పుడు నేను జేయుచున్నది.

శ్రీ:- కూర్పుండెద గాని, యీయాశ్రమ మెవ్వరిది ? మీగురువు గారి
     పేరేమి?

బ్ర: ఇంతీయేనా నీకేమియో తెలియుననుకొంటిని. (రాముఁడు
     చిఱునవ్వు నవ్వుచు బ్రహ్మచారీని వీపున దట్టుచుండును. ఇది మా
     గురువుగారి యాశ్రమము బ్రహ్మర్షీంద్రుఁడగుశంబుకర్షి మాగురువు
     గారు.