పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబుక వధ.

16

                తి రేకముగా దానినొనర్పఁజాలను. ఓనర్పకున్న జరుగునది యిది
                యేకదా ! రామరాజ్య మిట్టిదియని కొన్ని నాళ్లకయిన జగమె
                బుంగఁగలదు. శంబుకునివధ, న్యాయమో, యన్యాయమో,
                నిస్పాక్షి కబుద్ధితో నంత ర్వాణులు నిశ్చయింతురుగాత. చావునకు
                భయంపడి స్వత్వమును నశింపఁ జేసికొందుమా ?

అం:- ఇట్టి దారుణ కార్యములు జరుగకుండుఁగాక.

శం: యువరాజు ! యిప్పటికే చాల ప్రొద్దుపోయినది. ఇంకేమయిన
              నున్న యెడల జేపుముచ్చటించెదము. ఇంక నిదురింప బొమ్ము,

అం:- చిత్త ము (నిష్క్రమించును).

             శం:_ గీ|| జగముకంటి వేల్పు • సర్వకృత్యములకు
             సాక్షి గాఁగనన్ను • సాకుగాత
             స్వల్ప బుద్ధినగుట • సతతంబు పరికించి
             మంచిమార్గమందు * నుంచుగాత....................11

(నిష్క్రమించును)

ప్రథమాంకము