పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

శంబుక వధ.


శం:- ఎందుల కుపేక్షచేయుదురు ? వారి యాధిక్యమునకు భంగము
        లగు కార్యముల వారు పేక్షింతురా ? ఇది సహజమేకదా ! మఱియు
        నీయభిప్రాయములన్నియు, వికసింపక మొగ్గగా నున్న యపుడే గిల్లి
       వేయ విశ్వప్రయత్నములు సేసెదరు. ఇంతకుమున్నే ద్విజసంఘ
       మునందుఁగలవరపాటుద్భవిల్లినది.

అం: దేవా ! నాకొక భయము పొడముచున్నది. ఇది కలవరపాటుతో
        నాగునని నమ్మను.

శం:-- ఎంతవఱకుఁ బోవునందువు ?

అం:- రాజు బ్రాహ్మణాధీశుఁడు, అందు శ్రీరామచంద్రుడు వర్ణా
       శ్రమాచారముల నెలకొల్ప బద్ధ కంకణ్యుడు. కాన మీ స్థూలశరీర
        మునకే యుపద్రవము గల్గునని భీతిల్లుచుంటిని.

శం:_కుమారా ! యియ్యధినే నెఱుంగక పోలేదు. అయినను శ్రీ
       రామచంద్రుడు యుక్తాయుక్త విచారణ సేయక యీ యకార్య
      మునకు నొడిగట్టునను విశ్వాసము లేదు. దుష్టశిక్షణంబునకు, శిష్ట
      రక్షణంబునకును నుపయోగింపబడు చున్నదన్న యానిశాతకరవా
      లంబు నిరిపరాధియు, దుర్బలుఁడనునైన యొకముని కంఠము
      పై కెగయునా?

అం:- స్వామీ ! శ్రీరామచంద్రుఁ డొక్కఁడేయయిన నిట్టియవినీతి
        కార్యములకుఁ దెగఁడు కాని ద్విజులు బలవంత పెట్టి చేయించ
        కుందురా ! ఇయ్యది దుష్ట శిక్షణంబు, శిష్టరక్షణంబని, శ్రీరామ
        చంద్రునకు బోధింపరా ! శ్రీరామచంద్రుని నిమిత్త మాత్రునిఁ
        జేసెదరు.

శం.. శ్రీ రామచంద్రుఁడు బ్రాహ్మణుల చేతిలోని కీలుబొమ్మ
       యనియా నీయభిప్రాయము. అట్లయిన 'నేనుచింతింపవలసిన కార్యమే