పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మాం కము.

13


      
         రాజనీతి కామ. ఇది తలంచియే కొందఱు ఋషులు స్మృతులు
         రచించి సంఘమును బలవత్తరముఁ జేసికొనిరి. ఇదియే ఋషులకు,
         గల్గులాభము

అం:- ఈ సిద్ధాంతముచే మీ వాదము నీరసమగుట లేదా ? మనము పాలి
        తులము కాన సమానములగు హక్కుల నీక రాజ్యతంత్రావరణము
        నకు దూరముగ నుంచుట రాజనీతియే కదా!

శం:-- అగునుగాని యింకోక్క సంగతి యున్నది. ఇదిరాజనీతియే , కాని
        మన మేనాడో యేకమతస్థులమై వారియాచార వ్యవహారముల
       నవలం బించి, సంపూర్ణముగా నార్యసంఘమ తోనే భావమును
       బొందితిమి, ఇట్టి మనలను బరులుగా జూచుట రాజనీతికి విరుద్దము,
       కాన మనమార్య సంఘముతో పాటు సమాన స్వాతంత్ర్యమును, హ
       క్కులను బొంద దగియున్నాము. నానిని బొందుటకే మేమిప్పుడు
       సర్వప్రయత్నములు చేయుటకుఁ గృతనిశ్చయులమయి యుంటిమి.
       ఈయాశ్రమ స్వీకారముఁగావించి, హింసాపరాజ్ముఖుఁడనై భగవ
       ధ్యానముఁ జేసికొనుటకు నన్నీ ద్రావిడ ధర్మ మాటంకపఱుచునా ?
       ఆత్మకు నీయావరణతో సంబంధ మేమున్నది ? భగవంతుఁడు దీని
       నేల నిషేధించును ? నిషేధించిన భగవంతుఁడెట్లగును ? భగవంతు
       నకు సమబుద్ధి యుండదా !

అం:-మహాత్మా! సంపూర్ణ విజ్ఞానము బొందితిని. నాయవివేకప
        బ్రశ్న లమన్నింపుఁడు (సాష్టాంగ నమస్కారముఁ జేయును),

శం: వత్సా ! లెమ్ము, లెమ్ము; ఇదియనుచితము (లేవ దీయును)

అం:- ఈ యీబోధలను ద్విజులు విన్న తూష్ణీభావముతో నుపేక్ష
        సేయుదురా?

.