పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ఉదయార్కాంశు వికస్వరాంబుజ రమాయుక్తంబులై యొప్పు నీ
పదముల్ ధ్యానము చేసి ముక్తియుపతిం బ్రాపింపఁగా లేక సు
ర్మదవృత్తిన్ బశుమాంస మగ్ని దనరారన్ వేల్చుఁగా! దేవతా
మదిరాక్షీసురతేఛ్చ! భూసురుఁడు రామా! భక్తమందారమా!

36


శా.

ప్రాణి వ్యూహ లలాట భాగముల లీలాలోల చిత్తంబునన్
పాణీకోకిల వాణినాథుఁడు లిఖింపంబొల్చు భాగ్యాక్షర
శ్రేణిం బెంపఁదరంబెయెవ్వరికి సంసిద్ధంబుస్వారాట్ఛిరో
మాణిక్య స్ఫురదంఘ్రి తామరస రామా! భక్తమందారమా!

37


మ.

నిను సేవింపని పాపకర్ములకు వాణీనాథ గోరాజవా
హనసుత్రామముఖామరప్రవర వాచాగోచరంబై సనా
తనమై ముక్తి రమా సమేతమగు నీ ధామంబుసిద్ధించునే
మనురాడ్వంశసుధాబ్ధిసోమ! రఘురామా! భక్తమందారమా!

38


మ.

మొదలంజేసిన పుణ్యపాపములు సన్మోదాతిఖేదంబులై
యదన న్వచ్చి భుజింపఁబాలు పడు నాహా! యెవ్వరి న్వేఁడిన
న్వదలం జాలవవెన్ని చందములఁ దా వారింపఁ జింతించినన్
మదనారాలికినైనఁ దథ్యమిది రామా! భక్తమందారమా!

39


శా.

ఇం దందున్ సుఖమీయఁజాలని మహాహేయార్థ సంసారఘో
రాంధూ బృందనిబద్ధులై సతత మన్యాయ ప్రచారంబులన్
గ్రిందున్మీఁదును గానకెంతయున్ రక్తిన్ ధాత్రివర్తింతురౌ
మందుల్ సుందర మందహాసముఖ రామా! భక్తమందారమా!

40


మ.

అమరశ్రేష్టుని వారువంబునకు దూండ్లాహారమీశానమౌ
శి మహాభోగికి గాలిమేఁత, నిను హాళి న్మోయుమాద్యద్విహం
గమలోకేంద్రున కెల్లఁ బుర్వుగమియె బోనంబు ప్రారబ్ధక
ర్మ మవశ్యంబ భుజింప కెట్లుచను? రామా! భక్తమందారమా!

41