పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

నరుఁడెల్లప్పుడు నాజవంజవభరానమ్రాత్ముఁడై యున్నఁగా
ని రహస్యంబుగ నీ పదద్వయము ధ్యానింపన్ వలెన్ భక్తితో
బరమానంద సుధాసారనుభవలిస్సాబుద్ధుయై నుర్విఁగు
మ్మరి పుర్వుం బలెఁ బంకదూరగతి రామా! భక్తమందారమా!

42


శా.

దానంబాభరణంబు హస్తమునకు దద్ జ్ఞానికిన్నీపద
ధ్యానంబాభరణంబు భూసురున కత్యంతంబ గంగానదీ
స్నానంబాభరణంబు భూతలమునన్ బాడెంపుటిల్లాలికిన్
మానంబాభరణంబు తథ్యమిది రామా! భక్తమందారమా!

43


మ.

అదన న్వేఁడిన యాచక ప్రతతికీయంగా వలెన్ రొక్కమిం
పొదవన్ మీ కథలాలకింపవలె మేనుప్పొంగ గంగామహా
నదిలో స్నానము లాచరింపవలె హీన ప్రక్రియన్ మాని స
మ్మద చిత్తంబున మార్త్యుఁడెల్లపుడు రామా! భక్తమందారమా!

44


శా.

ఉద్యానాదిక సప్తసంతతుల బా గొప్పార నిల్పన్ వలెన్
సద్యోదానమునన్ బుధాళి కెపుడున్ సంప్రీతి సల్పన్ వలెన్
ప్రోద్యద్విద్యలు సంగ్రహింపవలె నిత్యోత్సాహియై మార్త్యుఁడో
మాద్యద్దానపకానన జ్వలన! రామా! భక్తమందారమా!

45


మ.

నిను భక్తిన్ భజియించినన్ గురువులన్నిత్యంబు సేవించినన్
ధనవంతుండయి గర్వదూరుఁడగుచున్ ధర్మంబు గావించినన్
జనతామోదక పద్ధతి న్మెలఁగినన్ జారుండు గాకుండినన్
మనుజుండారయ దేవుఁ డిమ్మహిని రామా! భక్తమందారమా!

46


శా.

అన్యాయంబు దొఱంగి యెల్లరకు నిత్యానంద మింపొంద సౌ
జన్య ప్రక్రియ నేల యేలు నతఁడున్ శాస్త్రానుసారంబుగాఁ
గన్యాదానము సేయు నాతఁడును వేడ్కన్ భూసురున్ బిల్చి స
న్మాన్యం బిచ్చినవాడు ధన్యుడిల రామా! భక్తమందారమా!

47