పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

దండం బీయదె నీకుఁగైకొనుము దోర్ధండాగ్రజాగ్రన్మహో
దండోత్తాల విశాల దివ్యాంతర కోదండాగ్ర నిర్ముక్త స
త్కాండ వ్రాత విఖండి తాహిత శిరఃకాండా! కనత్కుండలా!
మాండవ్యాది తపోధన ప్రణుత! రామా! భక్తమందారమా!

6


శా.

వింతల్ గాఁగడు మీకు సత్కృతులు గావింతును దుషారాద్రి జా
కాంతా క్రాంత జటాంతరాళ విలుఠద్గంగా తరంగచ్ఛటో
త్క్రాంతాత్యంత ఝుళం ఝుళన్నినద రంగద్ధాటి మీఱంగ సా
మంతా! సంతత శాంతిమంత! జయరామా! భక్తమందారమా!

7


మ.

రకపుంగావ్యకళాకలాప రచనా ప్రాగల్భ్య సంసిద్ధికై
ప్రకట ప్రేమ భజింతు నీశ మకుట ప్రస్ఫీత గంగా జలా
ధిక మాధుర్య కవిత్వ ధూర్వహస ధీ దివ్య ప్రభావాఢ్యఁ ది
మ్మ కవిశ్రేష్ఠు మదగ్రజున్ మదిని రామా! భక్తమందారమా!

8


మ.

సకలాభీష్ట ఫల ప్రదాయకుఁడవై చంచద్ధయాశాలివై
ప్రకట స్నేహ రసార్ద్ర మానసుఁడవై భంగీకృతానేక పా
తక ఘోరామయశాత్రవోత్కరుడవై ధాత్రీసుతం గూడి మా
మక చిత్తాజ్జమునన్ వసించు మొగి రామా! భక్తమందారమా!

9


మ.

మణి పుంఖాంకిత కంకపత్త్రచయ సమ్యగ్దివ్య తూణ ద్వయం
బణుమధ్యంబునఁ దళ్కు గుల్క ఖల దైత్యానీకహృద్భేదకృ
ద్ధణ నీయోగ్ర కఠోరకార్ముకము చేతంబూని నా వెంటల
క్షణుడు న్నీవును నంటి త్రిమ్మరుము రామా! భక్తమందారమా!

10


మ.

పలుమాఱున్ భవదీయ కావ్య రచనా ప్రాగల్భ్య మొప్పార ని
న్గొలుతున్ మామక మానసాబ్జమున బొంకుల్ గావు నీ వెచ్చటం
గలళొనం బొడకట్ట విట్టి వగ బాగా! మేల్! బళా! శ్యామకో
మల విభ్రాజితమందారా వయువ! రామా! భక్తమందారమా!

11