పుట:2015.373190.Athma-Charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. నియమబద్ధజీవితము 47

గుణ్యముగ వానిచొప్పున నాచరించి, యింక నెన్నిమిగిలెనో పిమ్మట సిరిచూచుకొనవలెను. క్రమముగ నిత్యవిధు లివ్విధమున నెర వేర్చు చుండినచో, సచ్ఛీలత దానియంత నదియే యలవడు నని యిందలి ముఖ్యోపదేశము.

అదివఱకే, అనఁగా 1888 వ సంవత్సరారంభమునుండియు, "దినచర్య" పుస్తకము లుంచునభ్యాసము చేసికొంటిని. ఏనాఁడు చేసిన పనులు, తలంచినతలంపులు, తటస్థించిన మేలుకీడులును, ఆనాఁటి రాత్రియే యీపుస్తకములందు సంగ్రహముగ లిఖియింపఁబడుచుండెను. దైవప్రార్థన, ప్రాత:కాలస్నానము, శరీర వ్యాయామము మొదలగు నలవాటులు చేసికొంటిని. పూర్వోదాహృతపుస్తకపఠన మప్పటినుండియు, నే నదివఱ కవలంబించినపద్ధతి మఱింత కట్టుదిట్టములతోఁ గూడుకొని జరుగుచుండెను. అందువలన నాకిపుడు నియమానుసారజీవిత మేర్పడెను.

ఆదినములలో నానిత్యకర్మానుష్ఠాన మీవిధముగ నుండెను : - ప్రాత:కాలముననే స్నానవ్యాయామము లైనపిదప, నేను ప్రార్థన సలుపుచుందును. అంత "బైబిలు - నూతననిబంధన"లోని మూఁడు నాలుగధ్యాయములు పారాయణము చేయుచుందును. దినపాఠము లన్నియుఁ జదివి, కళాశాల కేగి విద్య గఱచి, అచటనే సాయంకాలము వడ్రము నేర్చు చుందును. శరీరసాధకము చాలనిచో, డుబెల్సుతో కసరతు చేసి, అవశ్యమగు నింటిపని చక్క పెట్టుకొని, రమ్యప్రదేశ మేదేని సందర్శించియో, ఉద్గ్రంథపఠనము చేసియో సాయంప్రార్థనముతో దినకృత్యములు ముగించుచుందును.

ఇట్లు నేను 29 వ జూలైనుండి 12 వ అక్టోబరువఱకును ఏర్పఱుచుకొనిన నిత్యకర్మానుక్రమణపట్టికలు నా రెండవ దినచర్య