పుట:2015.373190.Athma-Charitramu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 48

పుస్తకమునఁ గలవు. ఈ కడపటితేదీనుండి యాపుస్తకమునం దివి యాగిపోవుటకుఁ గారణము, పుస్తకము రెండవవైపునుండి లిఖించిన దినచర్య భాగము అక్కడవఱకును వ్యాపించి యుండుటయే. మచ్చునకు వానిలో రెండుదినముల కార్యక్రమము నిట మల్లేఖించెదను : -

3 వ ఆగష్టు 188

  • 1. స్నానవ్యాయామానంతరమున దైవప్రార్థన.
  • 2. చలిదిపిమ్మట, తెలుఁగు : ప్రాతకవులు మువ్వురు.
  • 3. 1-3 గంటలమధ్య - ప్రార్థనసమాజకార్యము.

4. ఇంగ్లీషుపద్యకావ్యము : ఆర్కేడీసులో 30, ఇల్‌పెన్సి రోజోలో 10, లల్లీగ్రోలో 20 పంక్తులు.

  • 5. విద్యార్థి సమాజసభ : అచట నెవనిమనస్సు నొప్పింపక మెలంగుట.
  • 6. శరీరవ్యాయామము.

7. ప్రార్థన.

6 వ అక్టోబరు

  • 1. ప్రార్థన.
  • 2. బ్లాకీనుండి వ్రాయుట.

3. చరిత్రము.

4. గణితము.

5. మిల్టనులో కొంత.

  • 6. ప్రార్థన సమాజసభ.

7. వీలైనయెడల, వీరేశలింగముగారి ప్రార్థనసభ కేగుట.