పుట:2015.373190.Athma-Charitramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 38

యయ్యెను. నామిత్రుఁడు అమలాపురమున బసచేసి, నన్నుఁ జూచుట కీగ్రామము వచ్చుచుండువాఁడు. నా కిచ్చట సావాసులు లేని లోపము లేదు గాని, సత్సాంగత్యమె సమకూరకుండెను. నా సహచరుఁడు ప్రవేశపరీక్షలోఁ దప్పుచుండెడి ప్రాఁతకాలపు విద్యార్థి. చప్పనిపాఠ్యపుస్తకములచవియె కాని, సాహిత్యగ్రంథరుచి యాతఁ డెఱుఁగడు ! ప్రకృతియందలి సుందరదృశ్యములు, గానకళాదుల రామణీయకమును, వానికి హృదయాకర్షక విషయములు గావు. స్నేహపాత్రతాదిగుణములు కొన్ని గలిగియుండియును, ఈతఁడు, అనుభవరహితులగు నాబోటిచిన్న వారల కాదర్శప్రాయుఁడగు సుశీలుఁడుగాఁడు. నీళ్లు నమల నేల ? నామమాత్రావశిష్టుఁడగు బ్రహ్మచారియె యీతఁడు ! రచ్చ కెక్కిన జారుఁడు గాకున్నను, శీలసౌష్ఠవము గోలుపోయి, తనప్రకృతలోపములకు, తనయేకాకిత్వమును విషమపరిస్థితులను ముడివెట్టి మనసు సరిపెట్టుకొనినసరసుఁడు ! ఇట్టియువకుల వలపుపలుకలు, రసికత్వపుఁబోకడలును లోకానుభవము లేని పసివారలకు విపరీతకామోద్రేకము గలిగింపఁజాలియుండును. ఈతని సహవాస సంభాషణములు నా భావపవిత్రతకు భంగము గలిగించి, నీతినియమములను నీటఁ గలుపుటకు సంసిద్ధము లయ్యె నని నే నపుడు గ్రహించితిని !

8 వ మెయితేదీని కోనసీమసంచారము ముగించి, రాజమంద్రి చేరితిమి. మా తలిదండ్రులకు నా నేస్తకానిని గుఱించిన నిజము తెలిసిన యెడల, ఆగ్రహమున వారు నన్ను మ్రింగివేసియుందురు ! ఐన నీసహవాసుని దురాకర్షణ మహిమమునను, అతని దుష్ప్రసంగశ్రవణాసక్తి చేతను, ఇంకఁ గొంతకాలము నేను వానినే యంటిపెట్టుకొని యుంటిని. నాచిత్తపారిశుద్ధ్యమునకుఁ గలిగిన చెఱుపు, క్రియారూపముగఁ బరిణ