పుట:2015.373190.Athma-Charitramu.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. కథావిరచనము 567

సంస్కరించుచుండువాఁడను. అన్ని విధము లగు సొంపులతో నలరారెడి కథా భూషణమును భాషాయోష కర్పించుటయె నా మహాశయము. కథ ననేకమాఱులు నేను జదువుకొని, దానియం దేమాత్రమగు లోపము గానిపించినను, అది దిద్దక పత్రికలోఁ బ్రచురణకై ప్రతి నంపువాఁడను కాను.

1901 వ సంవత్సరముననే "చిత్రకథామంజరి" అను శీర్షికతో నే నొక కథాపుస్తకమును బ్రచురించియుంటిని. దీనిలో కల్పితకథలు గాని "నూర్జహాను" మున్నగు రచనములు కొన్ని గలవు. ఇపుడు వానిని దీసివైచి, వానికి బదులుగ నే నిటీవల "భారతి" మున్నగు పత్రికలలో వ్రాసిన స్వకపోలకల్పితము లగు 'గౌతమి', 'మాణిక్యము', 'మాలతి' మున్నగు కథలు కొన్ని చేర్చి, 'చిత్రకథామంజరి' రెండవ కూర్పును, ఏలూరు రామా ముద్రాలయమునఁ బ్రచురించితిని.

ఈ "చిత్రకథామంజరి" ప్రథమభాగమందలి కథలలో నేది యత్యుత్తమ మైనదో నిర్ధారణచేయు పట్ల మిత్రులకు నాకును గొంత యభిప్రాయభేదము గలిగెను. కథావైచిత్ర్యమున "కృష్ణవేణి" తమకు హృద్యముగ నున్న దనియు, దానిని నాటకముగఁ వ్రాయఁ దా నొకానొకపు డెంచితి మనియు, ఆపుస్తకమును కళాశాల తరగతిలో పిమ్మట బోధించిన దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారు నాకుఁ జెప్పిరి. "శారద" చక్కగ నున్నదని యా కథ చదివిన యొక రిద్దఱు చిన్ని వాలికలు నాతో ననిరి. 'గౌతమి' బాగుగ నున్న దని యొకరును, 'మాలతి' 'నిశ్చల'లు మంచివని మఱి యొకరును నభిప్రాయ మందిరి. కన్నవారికి సంతతి యందఱి యందును సమానప్రేమమె. ఐనను నా కేకారణముననొ "మాణి