పుట:2015.373190.Athma-Charitramu.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. వెంకటరత్నమునాయఁడుగారు 481

కాకినాడ,

10 - 4 - 1910

తెలుఁగు సంవత్సరాది.

"భాతృవరా !

మనకుఁ బ్రియ మగు నీ సంవత్సరాదిపండుగనాఁడు, వెనుకటి సంగతులు మఱచిపోయి, ముందు మరల నున్న మీప్రేమ కాస్పదునిగఁ జేయరా ? ఇపుడు , నే నే సమాధానము నీయను ! ఏసాకును జెప్పను ! క్షమాపణమే నేను వేఁడుచున్నాను !

"ఆకాశము అంధకారబంధురమైనను, గృహములోపల ప్రకాశముగనే యున్నదిసుఁడీ !

ర. వెంకటరత్నము"

దీనికి నా ప్రత్యుత్తరమిది : -

గుంటూరు

14 - 4 - 1910

"ప్రియమైననాయఁడుగారికి,

మీయుత్తరము చేరినది. ప్రేమపూర్వకముగ మీరు చాఁపిన కరమును సంతోష పూర్వకముగ నేను గ్రహించుచున్నాఁడను. * * * కాని, మీరే నన్ను క్షమింపవలెను. మీ యీకడపటి యుత్తరమును నా వెనుకటిచర్యలను విమర్శించిచూడఁగా, మొదటినుండియు నాదే తప్పిదమని నేను గ్రహించుచున్నాను. అహంభావపూరితునికి న్యాయవిచక్షణ మసాధ్యము. అత్యాశాపీడితుఁడనై నే నిదివఱకు వ్యవహరించినట్లు నా కిపుడు ద్యోతక మగుచున్నది. నాకు తగినశాస్తి