పుట:2015.373190.Athma-Charitramu.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. వీరేశలింగముగారి సాయము 409

రావలెనని నేను మాతమ్ముఁడును 12 వ తేదీని రాజమంద్రినుండి బయలుదేఱి, మఱునాఁటి ప్రొద్దున్న మోగల్లు చేరితిమి. అందఱు నచట సేమమె. పిల్లవాఁడు బాగుగనే యుండెను గాని, వట్టి బలహీనుఁడు. మావాండ్రను దీసికొనిపోయెద మని మే మనఁగా, మేము బారసాలను వైభవముగ నచట జరిపినఁ గాని తల్లిని పిల్లవాని నిపుడు పంప వలనుపడదనియు, లేనిచో రాఁబోవుసెలవులలో మా యింటికే వారిని మేము తోడుకొనివచ్చి బారసాల చేసికొనవచ్చుననియు, నరసయ్యగారు చెప్పివేసిరి ! కోపస్వభావుఁడగు మాబావ షరతులకు మే మంగీకరించి మరలి వచ్చితిమి.

అంతట సోదరుల మిద్దఱమును రాజమంద్రి వెంటనే విడిచి, వేలివెన్ను మార్గమున గోటేరు పోయి, మా ఋణదాత దర్శనముఁ జేసికొని, తణుకు వచ్చితిమి. అచట నొక యున్నతపాఠశాలను నెలకొల్పు ప్రయత్నములు జరుగు చుండెను. నన్ను దానికి ప్రథానోపాధ్యాయునిగ నుండుఁడని పలువురు కోరిరి. కాని, తగినంత స్థిరత్వము లేని పాఠశాలలోఁ బ్రవేశింప నా కిష్టము లేదు.

ఆ సంవత్సరమున గోదావరి మండలసభలు అమలాపురమున జరుగవలసి యుండెను. నన్నా సభలకు స్నేహితు లాహ్వానించిరి. సాంబశివరావు కామేశ్వరరావుగార్లతోఁ గలసి నేను 26 వ మేయి తేదీని అమలాపురము బయలుదేఱితిని. మండల రాజకీయసభకుఁ బోయి, "స్టాండర్డు" పత్రిక యుపవిలేఖకునిగ వార్తలు వ్రాసి యా పత్రిక కంపితిని. 28 వ తేదీని సంఘసంస్కరణసభ జరిగెను. దానికి గోటేటి శివరావుగా రధ్యక్షులు. 'వేశ్యాజననిషేధము' 'వితంతూవివాహప్రోత్సాహము' లను గుఱించిన తీర్మానములు నేను బ్రతిపాదించితిని. గోదావరిమండలస్థాయి సంఘములో నన్నొకసభ్యు