పుట:2015.373190.Athma-Charitramu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. పెండ్లి బేరములు 317

ఈచింన్న దాంన్ని కృష్ణయ్యకు యివ్వడంకు గంగరాజు శెలవుప్రకారం తాను నరసాపురంనుంచి వచ్చినా ననిన్ని, యేవిధమయ్ని లోట్లూ లేకుండా యెక్కడ వివాహం చాయమంటే అక్కడ వివాహం చేస్తామనింన్ని, శీఘ్రంగా రోజులలో జర్గవలశియుంటుం దనింన్ని చెప్పినాడు. కాబట్టి వ్రాశేది యేమంటే, యీసంబంధం చేసుకోవడముకు మీఅప్పకున్ను నాకున్ను కోరిక కలిగియుంన్నది. దయవీక రాజీకములచేత ఈ సం. రం కృష్ణయ్య పరీక్ష ప్యాసైనా కాక పోయినా, యీకార్య అయివుంటే మంచిది. మనం చివర్కు ధవళేశ్వరంలో చాయమన్నప్పటికీ, చాయతల్చుకునియున్నారు. మనం వప్పుకుని అంగీకరించి ఉత్తరం వ్రాశినట్టుగానే, ముహూర్తం పెట్టి స్తిరపరుస్తుంన్నారు. నీవు 5, 6, రోజులలో యిక్కడికి వచ్చి 10, 15 రోజులలోపల ఈవివాహం చేయించి, తరువాత వెంటనే వెంకట్రామయ్య నీవుంన్ను బెజవాడ వెళ్ల వచ్చును. * * * * *

"మనకు శ్రమలేకుండా పిల్లవానికి వివాహం తటస్తమయినప్పుడు మానివేశి, తటస్తం కానప్పుడు ప్రయత్నం చాయడం యింత్తకంటె లోపం లేదు. ఈపిల్ల రెండుమూడుసంవత్సరములకు గాని కాపరముకు రాదు. అప్పట్కి కృష్ణయ్యకు కొంన్ని పరీక్షలు కాబడును. కృష్ణయ్యకు యిస్తామని వచ్చిన సంబంధముల పిల్ల లకు, మేము వప్పుకోనివాళ్లకు 1, 2, కి ధవిళేశ్వరంలో 4 రోజులు యీలోగా వివాహములు కాబడ్డవి. గన్కు అంన్ని సంబంధములుంన్ను కూడా యిదేప్రకారం దాటిపోగలవు. యీకార్యం అయ్ని తరువాత యింత్త తొందరకార్యములు తక్కినవి కావు. గన్కు యీవుత్తరం అందిన వెంటనే నీ జవాబు పంప్పిస్తే, నరసాపురం గంగరాజుగారి యిలాకా వారితో మాట్లాడి ముహూర్త నిర్ణయం యేర్పరుస్తున్నాము. యీ