పుట:2015.373190.Athma-Charitramu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 300

నే నంతట పాఠశాలాధికారి టానరు దొరను జూడఁబోయితిని. నా కీళ్ల వాత మెటులుండె నని యాయన చేసిన కుశలప్రశ్నమె నాకు మంచిసందిచ్చెను ! ఏతద్రోగోపశమనమునకె నే నిపుడు మద్రాసు వెళ్లఁదలంచి, అచట పొట్టజరుగుట కొక చిన్న పనిలోఁ బ్రవేశింప నిశ్చయించితిని కాన నా కాఱునెలలు సెలవీయుఁ డనియు, నేను తిరిగి వచ్చు వఱకును మాతమ్ముఁడు నాస్థానమం దీపాఠశాలలో బోధకుఁడుగ నుండు ననియును నేను జెప్పితిని. మాతమ్ముని యుద్యోగముమాట యెటులుండినను, నాకు మాత్రము సెలవు దొరకు నని దొర చెప్పెను.

నారాక నిశ్చయమని అయ్యరుగారికి నే నంతట చెన్నపురి వ్రాసివేసితిని. తలిదండ్రుల కీ సంగతి తెలియఁబఱిచితిని. చెన్న పురిలో నాకు బాగుగ జరుగుచున్నచో, నే నచటనే నిలిచిపోవచ్చును గావున, నాసామాను నాతోఁ గొనిపోవ నిశ్చయించుకొని, అనవసర మగు పుస్తకములు వస్తువులును అమ్మివేసితిని. తలిదండ్రులను జూచుటకు మరల 11 వ సెప్టెంబరున నేను రాజమంద్రి వెళ్లితిని. మాతల్లి యపుడె దేహస్వాస్థ్యము నొందుచుండెను. రెండవ మఱఁదలికి జబ్బుగ నుండెను. మా తాటియాకుల యింటిలో తేమ యుఱియుచుండెను ! ఆకుటీరమున దరిద్రదేవత తాండవమాడు చుండెను ! నాకు వెఱ్ఱి దు:ఖము గలిగెను. జననీజనకుల దురవస్థ నే నెట్లు తొలఁగింపఁగలనా యని తలపోసితిని.

అంత వీరేశలింగముపంతులుగారు సాంబశివరావు మున్నగు స్నేహితులను జూచి, నేను బెజవాడ బయలు దేఱితిని. నాకు వీడ్కోలొసంగుటకు పెద్దతమ్ముఁడు రేపల్లెనుండి బెజవాడ వచ్చియుండెను. మాపాఠశాలతనిఖీ 14 వ సెప్టెంబరుతో ముగిసెను. సెప్టెంబరు