పుట:2015.373190.Athma-Charitramu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 216

నా నూతనాశ్రమజీవితమును స్పష్టముగ సూచించుటలో యన నీనూతన పురనివాసమును నా కిపుడు సంఘటిల్లెను. బెజవాడ నే నిదివఱ కెఱుంగనిది కాదు. చెన్నపురి పోయి వచ్చు చుండినప్పుడు పలుమాఱు నేనీ పట్టణమును సందర్శించుచునే యుంటిని. కాని యిదివఱ కెపుడును, ఈనగర మామూలాగ్రముగ నేను బరిశీలింప లేదు. కావున విజయవాడపురము నా కెంతయుఁ గ్రొత్తగ నుండెను. ఇచటిప్రకృతిదృశ్యము లత్యంతరమణీయములు. కృష్ణవేణీనది, దాని కిరుపార్శ్వములనుండి ఱెక్కలవలె మింటి కెగయుపర్వతపంక్తులు, తూర్పున మొగలరాజపురపుకొండ, నదిమీఁదఁ గట్టినయానకట్ట రెయిలువంతెనలు, ఏటినుండి వెడలిన మూఁడు కాలువలు, దాపుననుండు కొండమీఁద వెలసిన కనకదుర్గాలయము, - ఇవి యన్నియు నేత్రోత్సవముఁ జేయుచుండును. బందరురైవిసుకాలువలమధ్య విచిత్రద్వీప కల్పమువలె నేర్పడిన బకింగుహాముపేట యుద్యానవనమువలె సొంపారుచుండును. బందరుకాలువ యొడ్డునందలి చిన్న బాటను చెట్లనీడను నడచిపోవునపుడు, కాలువనీటినుండి నీతెంచెడి చల్లనిగాలి ననుభవించుచు, పక్షుల మధురాలాపములు వినుచును, నే నేదో విచిత్రలోకవిహారము చేయునటు లనుకొనువాడఁను!

ఇచటివారికిని గోదావరిమండలజనులకును, వేషభాషాచారములం దనేకభేదములు నాకుఁ బొడఁకట్టెను. అయినను వీరును సోదరాంధ్రులే. కావున విద్యాబోధకరూపమున నాంధ్రావనియందు సాంఘిక సేవ లొనర్ప నే నవకాశములు గలిపించుకొనఁబూనితిని.

నేను బెజవాడ వచ్చిన మఱునాఁడే, ఆ పాఠశాలావిద్యార్థులకు బహుమతులు పంచి పెట్టఁబడెను. ఆ సభాసందర్భమున నచటికి విచ్చేసిన పౌరప్రముఖులతో ప్రథమోపాధ్యాయులగు శ్రీ ధన్వాడ అనంతము